top of page
  • Writer: Kranthi Chand
    Kranthi Chand
  • Apr 10, 2019

బండెనక బండి కట్టి,

పదహారు బండ్లు కట్టి,

వస్తిమన్నో నీ మీటింగుకాడికి ...


మా ఇంటి బిడ్డంటివి,

మా బాధలు ఎరుకటివి,

మా బ్రతుకులు మారుస్తాటీవి...


నీ మంత్రివోడు లంచగొండి ఎదవాయె,

నీ పార్టీవోడు బూతుల మారీచుడాయే,

నువ్వేమో వీరి కొమ్ముగాసి గమ్మునాయే...


యెట్లన్నో నే నీకేసేది ఓటు,

ఎందుకెన్నో నీకేసేది ఓటు,

వచ్చిందా నాకాడికి నీ నోటు?


 
 
  • Writer: Kranthi Chand
    Kranthi Chand
  • Apr 9, 2019

తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా!

తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా!


గుడిసెలోని ముసలి అవ్వ కన్నీటి గాథ...

పంటపోయిన రైతన్న గుండెలోని బాధ...

బువ్వకోసం అలమటించే పేదోడి రాత...


తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా!


ఇంస్టాగ్రామ్ లొ లైక్ కొడతావ్...

ఫేస్బుక్ ల షేర్ చేస్తావ్ ...

యూట్యూబ్ ల వీడియోలు చూస్తావ్ ...

అయినా గుడ్డిగానే బతుకుతావ్ ...


తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా?


ఓట్ ఏమో హక్కంటావ్ ...

డెమోక్రసీ మనదంటావ్...

పార్టీలు దుమికేటోడిని,

గెలిపించి సభకు పంపుతావ్...


తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా!


కుల గజ్జి అంటిన కాకిని పోమంటివా?

మత ద్వేషం పూసిన నోరునే మూస్తివా?

ఆడపడచుని చరిచిన రాబందుని తంతివా?

మంది మార్బలం ఉన్న ముర్కుడిని ఎదురుంటివా?


తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా!


దగాపడిన ప్రజల మంచి యాడరో, యాడారో?

అమ్ముకున్న ఓట్ విలువ నేడెంతరో, ఎంతరో?

మంత్రి దండుకున్న లంచాలు నీవేరో, నీవేరో...

మిగిలేటి కష్టాలు దుఖ్ఖలు నీకెరో, నీకెరో...


తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా!

తెలివొచ్చేదా? నీకు తెలిసొచ్చేదా!


 
 
bottom of page