పిలుపు
- Kranthi Chand
- Dec 24, 2019
- 1 min read
Updated: Jun 4, 2020
సీతక్కో గీతక్కో,
చూసావంటే రమణక్కో,
లాఠీకి బెదరని లక్ష్మిలెందరో,
తూటకి ఎదురు నిలిచిన రాణిలెందరో ...
దారి మళ్ళిన ప్రజాస్వామ్యానికి,
నారి భేరి జవాబు చెబుతోంది,
కలసి నడుదాం రారండో , దేశ
గతిని మార్చుదాం లేరండో...
షెహ్ల, రానా కదం తొక్కి కదిలినారు,
అయేషా, లదీదాలు గళం విప్పి గర్జించినారు,
మన బిడ్డలు తోబోట్టువులు మొదటి అడుగు వేశారు,
జరిగే అన్యాయానికి అరికట్టేందుకు పోరాడుతున్నారు...
లేరండోయ్, రారండోయ్, సీతక్కో గీతక్కో,
కలిసి అడుగేద్దాం రావే రమణక్కో,
ఉద్యమాల భారతానికి పునాదులు వేద్దాం,
మెరుగైన పాలన మన హక్కందాం ...
Edited by Naga Venkatesh
Comments