top of page

కలల రూపం

  • Writer: Kranthi Chand
    Kranthi Chand
  • Apr 3, 2019
  • 1 min read

నిదురించిన జ్వాలని తట్టిలేపి,

మనసులోని భావాలను పలికించి,

పెదాలు దాటని మాటలు వింటూ,

ఆ పెదాలని మైమరపించావే ...


అమ్మ చేతి వంట నెమరు వేసి, నీ కౌగిలితొ నను కవించి, శ్వాసలోని ఆశకు రూపమై, బాటసారి జీవితాన తోడుగా నిలిచావే... కలాన్ని కదిలించి, కలల్ని చిగురించి, కవితకు స్పూర్తి, భావితకు నాందివై, నీ దారిన నువ్వు ఎగిరిపోతాంటివా, ఓహ్ కోటి కబురులా బుల్లి పిట్టా, ఇక  సెలవా?


Comments


bottom of page