- Kranthi Chand
- Jul 11, 2019
కలం మారిన, కథె మారును,
కదం మారిన, కలే మారును...
నీకు అనిపించొచ్చు ఇది...
నవ శఖ ఆరంభం.
కొత్త నాయకుడి ఉదయం.
పాలనా విధాన సంస్కరణం.
దిక్సుచి దూరదృష్టి సమాజ సమతుల్యం.
నాకు తెలిసినది మాత్రం...
రాజకీయ రణ క్రీడలొ మరొ అధ్యయం.
దోపిడి దగాకోరు లంచగొండి వెదవల
పందేరం, కాబోయే మరొ రావణ కాష్టం...
జనులెరిగిన పచ్చి నిజం...
నేడు ఇచట, రేపు అచట,
అధికారమే ఐస్కాంతమాయెనట,
జెండా ఏదైనా, కండువ కొత్తదైనా,
డబ్బు గూటికే వీరి తుది అడుగట...
మేలుకొను వేళాయెరా ...
నువ్వు నేను మరచిన పౌరాధికారం,
ప్రశ్నించే కర్తవ్యం, కాలరాలునురా
మనం కలలుకన్న స్వరాజ్యం..
రెప్ప మూసినా విడగొట్టుదురురా,
కనులు తెరవరా సహొదరా ... !