- Kranthi Chand
- Jun 7, 2019
వెండి వెన్నెల దివి తీరాన,
సాగే ప్రవాహ రాగాన,
మనసున ఆగని దాగని
మాటలనే నీతో తెలుపనా ...
ఇంటి ముంగిట ముగ్గు వేయగా,
ఆరు బయట పందిరిసడిన,
తొంగి చూసి పరవశించి,
నను నేను మరువగా...
మడి చీర వయ్యారంలో,
నడిచే శృంగార వీణ,
నీ తడి కురుల చిక్కుల్లో,
బంధీనై నే జీవించగా...
జాలువారే నీ వాలు జడ,
కొప్పున జాజిమల్లెల సువాసన,
సత్యభామనే తలపింతువులే,
ఆ కోపతాపాల నే సేదతీరగా...
పులకించెనే మది ఆ శృతిలో,
కవ్వేనే నీ మాటల సడిలో,
కనుల వెలుగులు, పెదవి విరుపులు,
మురిసె చెక్కిళ్లు, మెరిసే నా లోగిళ్ళు...